- Step 1
ముందుగా బంగాళాదుంపలు బాగా కడిగి మీకు నచ్చిన ఆకృతిలో కోసుకోవాలి.
- Step 2
మరి చిన్న ముక్కలు కాకుండా ఉంటే చాలు. ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి కార్న్ ఫ్లోర్ కలపాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేయించాలి.
- Step 4
గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడ స్టవ్ మీద మరో కళాయి పెట్టి అందులో కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం వేసి వేయించాలి.
- Step 6
అవి బాగా వేగాక అందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి మళ్లీ వేయించాలి.
- Step 7
ఇప్పుడు కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. స్టవ్ కట్టేసి... ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లారబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 8
ఇప్పుడు ముందగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే... బంగాళాదుంప మంచూరియా రెడీ.