- Step 1
బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.
- Step 2
అనంతరం పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయించాలి.
- Step 3
అవి వేగాక టోమాటో ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 4
అవి వేగాక కొబ్బరి తురుము, రొయ్యలు వేయాలి. రొయ్యలు కాసేలపు వేగాక బియ్యం, పెసరపప్పు, మినపప్పు వేసి కలపాలి.
- Step 5
అలగే చిటికెడు పసుపు, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. బాగా కలిపాక నాలుగున్న కప్పుల నీళ్లు వేసి కలిపి మూత పెట్టేయాలి.
- Step 6
మూడు విజిల్స్ వచ్చాక దించేస్తే మెత్తటి రొయ్యల కిచిడీ సిద్ధం.