- Step 1
గుడ్లను ఉడకబెట్టి పచ్చసొనను తీసేయాలి. ఉడికిన తెల్లసొనను సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి.... అందులో బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయించాలి.
- Step 3
అవి వేగాక ఉల్లి తరుగు వేయాలి. అది కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్దు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- Step 4
టమోట తరుగు కూడా వేసి బాగా కలపాలి. టమోటాలు కాస్త మెత్తబడినట్టు అవుతాయి అప్పుడు కారం, పసుపు వేసి కలపాలి.
- Step 5
ఇప్పుడు అందులో ముందుగా తరిగి పెట్టుకున్న గుడ్ల తరుగును వేసి బాగా కలపాలి.
- Step 6
అలాగే పచ్చిబఠాణీలు, కాస్త ఉప్పు కూడా వేసి ఉడికించాలి. దించడానికి అయిదు నిమిషాలు ఉందనగా కొత్తిమీర చల్లాలి.