- Step 1
రొయ్యల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూడాలి. ఒక బౌల్ లో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ పావుగంటసేపు అలా వదిలేయాలి.
- Step 2
ఇప్పుడు ఓ గిన్నెని స్టవ్ మీద పెట్టి గ్లాసుడు నీళ్లు పోయాలి. అవి మరిగాక అందులో రొయ్యల మిశ్రమాన్ని వేసేయాలి. రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 3
తరువాత ఒక టీస్పూను కారం, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్ పొడి వేసి కలపాలి. మూత పెట్టేసి రెండు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి.
- Step 4
తరువాత మూత తీసేసి మళ్లీ కలపాలి. మరో మూడు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి. నీరు బాగా ఇంకిన తరువాత స్టవ్ కట్టేయాలి. సగం ఉడికిన రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు రొయ్యల్లో కారం, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
- Step 6
నూనె వేడెక్కాక రొయ్యల్ని అందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. రొయ్యలు రెండు వైపులా వేయించాక వాటిని బయటికి తీసేయాలి. ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ చేస్తే సరి.