- Step 1
టొమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటి గుజ్జును తీసి బౌల్ లో వేయాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూనుల నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు వేయాలి.
- Step 4
అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉండాలి.
- Step 5
రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జును, పంచదారను, నెయ్యి వేసి కలపాలి. బాదంపప్పు, జీడిపప్పు కూడా వేయాలి.
- Step 6
ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో యాలకుల పొడి చల్లి దించేయాలి.
- Step 7
తరువాత ప్లేటు అడుగుకు కాస్త నెయ్యి రాసి హల్వాని ప్లేటులో వేయాలి.
- Step 8
దానిని నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్ చేసుకుంటే సరి. తినేందుకు టొమాటో హల్వా సిద్ధం.