- Step 1
ఒక గిన్నెలో టమాట తరుగు, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చిలను వేసి కలిపి ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఓట్స్ ని మిక్సీలో వేసి కాస్త పొడిలా చేసుకోవాలి.
- Step 2
ఆ పొడిలో పెరుగు వేసి మళ్లీ మిక్సీ చేయాలి. ఇప్పుడు మెత్తటి రుబ్బులా తయారవుతుంది. దానిని తీసి ఒక బౌల్ లో వేయాలి. ఆ రుబ్బులో కాస్త నీళ్లు కలిపాలి.
- Step 3
ఇప్పుడు అందులో అల్లం తరుగు, కరివేపాకులు, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే నీరు వేసుకోవచ్చు.
- Step 4
బేకింగ్ సోడాను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టి కాస్త నూనె రాసి వేడి చేయాలి.
- Step 5
ఓట్స్ రుబ్బుని ఊతప్పంలా పోసుకుని పైనా ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా తరుగు మిశ్రమాన్ని చల్లాలి.
- Step 6
తరువాత కొన్ని చుక్కల నూనె చల్లి మూత పెట్టేయాలి. మీడియం మంట మీద రెండు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి.
- Step 7
అనంతరం ఊతప్పాన్ని తిరగేసి రెండో వైపు కూడా ఉడకనివ్వాలి. తరువాత తీసి వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది.