- Step 1
అరటికాయల్ని ముక్కలు కోసుకోవాలి. మీర పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేయాలి.
- Step 2
ఇప్పుడు ఓ బౌల్ లో నీళ్లు, మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు వేసి బజ్జీల పిండికి ఎలా కలుపుతారో అలా కలపాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
- Step 4
నూనె వేడెక్కాక కలిపిన బజ్జీల పిండిలో అరటికాయ ముక్కల్ని ముంచి తీసి నూనెలో వేయించాలి. అవి గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసేయాలి.
- Step 5
ఇప్పుడు కళాయిలో కొద్దిగా నూనె ఉంచి మిగతా నూనె అంతా తీసేయాలి.
- Step 6
ఆ నూనెలో పొడుగ్గా తరిగిని పచ్చి మిర్చి, క్యాబెజీ తరుగు వేయించాలి.
- Step 7
అనంతరం వేయించిన అరటి ముక్కల్ని వేసి కలపాలి.
- Step 8
అందులో అజినోమోటో, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి. చివర్లో కొత్తి మీర చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే అరటికాయ మంచూరియా రెడీ.