- Step 1
చేపముక్కలను బాగా కడిగి అందులోని ముల్లులను తీసేయాలి.
- Step 2
ఇప్పుడు ఆ ముక్కలను చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, కాస్త నీరు పోసి బాగా కలపాలి.
- Step 4
అందులో చేప ముక్కల్ని కూడా వేసి కలపాలి. కావాల్సి వస్తే కాస్త నీరు మళ్లీ వేసుకోవచ్చు.
- Step 5
ఆ మిశ్రమాన్ని పకోడీలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి.
- Step 7
ముక్కలు గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించి తీసేయాలి. వాటిని ఎలాంటి చట్నీ అవసరం లేకుండా తిన్నా రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో ఉల్లి పాయ ముక్కల్ని తింటే బాగుంటుంది.