- Step 1
చేపముక్కల్ని రెండు నిమిషాల పాటూ ఉడికస్తే కాస్త మెత్తగా తయారవుతాయి.
- Step 2
అప్పుడు వాటిలోని ముళ్లని తీసేసి చేత్తొనే పొడిపొడిగా తురుములా చేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
- Step 3
నూనె వేడెక్కాక అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి తరుగు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో పసుపు, కరివేపాకు కూడా వేసి వేయించాలి.
- Step 4
బాగా వేగాక చేప ముక్కల తురుముని కూడా అందులో వేసి బాగా కలపాలి. సరిపడినంత ఉప్పు వేసి మళ్లీ బాగా కలపాలి.
- Step 5
మరీ స్పైసీ గా కావాలనుకుంటే అర చెంచా కారాన్ని కలుపుకోవచ్చు. గుడ్డు పొరటు లాగే ఇది కూడా బాగా వేగాక స్టవ్ కట్టేయాలి.
- Step 6
పైన కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేస్తే సరి. చేప పొరటు తినేందుకు రెడీగా ఉన్నట్టు. దీనిని చపాతీలో తింటే చాలా బాగుంటుంది.