- Step 1
ముందుగా శెనగలను గంట పాటూ నానబెట్టి, తరువాత కుక్కర్ లో ఉడకబెట్టాలి.
- Step 2
ఉడకబెట్టిన శెనగల్ని నీరు వార్చేసి, కళాయిలో వేయించాలి.
- Step 3
ఇప్పుడు ఒక బౌల్ వేయించిన శెనగలు, బాగా సన్నగా తురిమిన పాలకూరని, ఉల్లిపాయల ముక్కల్ని, పచ్చి మిర్చి ముక్కల్ని వేసి కలపాలి.
- Step 4
ఇప్పుడు శెనగపిండి, ఉప్పు, ఛాట్, చనా మసాలాలు వేసి బాగా కలపాలి.
- Step 5
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 6
కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి బాగా వేడెక్కాక బాల్స్ కట్ లెట్ చేత్తో అద్ది నూనెలో వేసి వేయించాలి.
- Step 7
గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి తీసేయాలి. అంతే పాలకూర కట్ లెట్ సిద్ధమైనట్టు. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటా కెచప్ లతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.