- Step 1
పనీర్ ముక్కలపై రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండిని చల్లి... అన్ని ముక్కలకి పిండి అంటేలా టాస్ చేస్తూ కలపాలి. ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కళాయిలో నూనె వేసి కాస్త వేడెక్కాక పనీర్ ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 2
మీడియం మంట మీదే ముక్కలు ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
- Step 3
వాటిని తీసి నూనె పీల్చుకునే కాగితంపై వేసి పక్కన పెట్టేయాలి.
- Step 4
ఉల్లిపాయల్ని నిలువుగా 8 నుంచి 10 ముక్కలు వచ్చేలా కట్ చేయాలి. అలాగే క్యాప్సికమ్ ను నిలువుగా 8 ముక్కుల చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా నిలువుగా కత్తిరించుకోవాలి.
- Step 5
టేబుల్ స్పూను మొక్క జొన్న పిండి, టొమాటో కెచప్, వైట్ వెనిగర్ ను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకు పట్టించాలి.
- Step 6
అనంతరం కళాయిల నూనె పోసి వేడెక్కాక నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి వేయించాలి. కళాయిని టాస్ చేస్తూ ముక్కల్నీ క్రిస్పీ వేగేలా చేయాలి. అనంతరం ముందుగా వేయించిన పన్నీర్ ముక్కల్ని వేయాలి.
- Step 7
చివరల్లో ఓ స్పూనుడు మొక్కజొన్న పిండిని చిన్న బౌల్‌లో వేసి అందులో మూడు నుంచి అయిదు స్పూనుల నీళ్లు పోసి బాగా కలపాలి.
- Step 8
ఆ మిశ్రమాన్ని స్టమ్ మీద ఉన్న పన్నీర్ ముక్కల్లో వేసి కలుపుతూ ఉండాలి. అది ఇంకిపోయాక స్టవ్ కట్టేయాలి. అంతే చిల్లీ పన్నీర్ రెడీ.