- Step 1
మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కీమాలో నీరు లేకుండా పిండేయాలి.
- Step 2
ఈలోపు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు స్పూనుల నీళ్లువేసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.
- Step 3
ఆ పేస్టులోనే కీమా, ధనియాల పొడి, ఉప్పు, కారం కలిపి వేసి బాగా కలపాలి.
- Step 4
ఆ మొత్తం మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. చుట్టినప్పుడు గట్టిగా నొక్కితే బాల్స్ విడిపోకుండా ఉంటాయి.
- Step 5
ఒక గిన్నెలో నీళ్లు వేసి... అందులో బాల్స్ ని వేసి బాగా ఉడికించాలి. బాల్స్ ముక్కముక్కలుగా విడిపోతాయేమో అన్న భయం అవసరంలేదు. కీమాని కడిగినప్పుడు అందులో నీల్లు పిండేసాం కాబట్టి అంత త్వరగా బాల్స్ విడిపోవు. చక్కగా ఉడుకుతాయి.
- Step 6
బాగా ఉడికాక వాటిని బయటికి తీసేయాలి. బాణలిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని వేడెక్కాక ... ఈ బాల్స్ ని అందులో వేసి వేయించాలి.
- Step 7
గోల్డ్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటే... మటన్ కీమా బాల్స్ సిద్ధమైపోతాయి.