- Step 1
ముందుగా ములక్కాడలను కడిగి మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. .
- Step 2
ములక్కాడలను ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
పాన్ లో పల్లీలు, నువ్వులు, మినప్పప్పు,, ఎండుకొబ్బరి, దోరగా వేయించుకుని. గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
పాన్ లో నూనె వేడిచేసి అందులో ఆవాలు, కర్వేపాకు, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి.
- Step 5
ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో టమాట వేసి 2 నిమిషాలు మగ్గించాలి.
- Step 6
టమాట మగ్గిన తరువాత అందులో కొత్తిమీర పౌడర్, కారం, ఉప్పు, పసుపు వేసి 1 నిమిషం మగ్గించాలి.
- Step 7
ఇప్పుడు ఉడికించిన ములక్కాడలు, పల్లీలపేస్ట్, వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి.
- Step 8
గ్రేవి చిక్కబడేంతవరకు ఉడికించి పుదీనతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.