- Step 1
గోధుమపిండి, మైదా, నీళ్లు కలిపి చపాతీ పిండి కలిపినట్టు కలపాలి. అందులో ఉప్పు, నూనె కూడా వేసుకోవాలి.
- Step 2
పిండి బాగా కలిపాక తడి వస్త్రంలో చుట్టి పక్కన పెట్టేయాలి. ఈలోపు పుదీనాను, టమాటాను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక తాళింపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించాలి.
- Step 4
అవి వేగాక సన్నగా తరిగిన టమాటా, పుదీనా వేసి వేయించాలి. బాగా మగ్గాక ఉప్పు చల్లి ఆపేయాలి.
- Step 5
దానికి చల్లార్చాక చపాతీ పిండిని ఉండల్లా చుట్టి, వాటి మధ్యలో పుదీనా మిశ్రమాన్ని కూరి మళ్లీ ఉండల్లా చుట్టేయాలి.
- Step 6
వాటిని పరోటాలా ఒత్తుకుని పెనం మీద చక్కగా కాల్చుకోవాలి. పుదీనా పరోటాలను ఆలూ కుర్మా, టమాటా చట్నీతో తింటే బాగుంటాయి.