- Step 1
చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించాలి.
- Step 3
బంగారు వర్ణం వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి.
- Step 4
అదే కడాయిలో మళ్లీ కొంచెం నెయ్యి వేసి సన్నని మంట మీద రవ్వను వేయించుకోవాలి.
- Step 5
రవ్వ రంగు మారిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలపాలి.
- Step 6
చివరగా పాలు పోసి మరికొద్దిసేపు కలపాలి.
- Step 7
ఇప్పుడు స్టౌ మీద నుంచి దించి చేతికి నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చేసుకోవాలి.
- Step 8
చల్లగా అయితే లడ్డులు చేయడానికి రావు.