- Step 1
కప్పు పంచదారను లేత పాకం పట్టుకుని పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బాణలిలో రెండు టేబుల్‌స్పూన్లు నెయ్యి కరిగించి క్యారెట్ తురుమును వేయించాలి.
- Step 3
అది వేగాక మిగిలిన పంచదార వేసేయాలి. హల్వా దగ్గరపడేవరకు మధ్యమధ్య కలుపుతూ ఉండాలి.
- Step 4
ఆ తరవాత యాలకులపొడి వేసి దింపేయాలి. ఈ క్యారెట్ హల్వాను కాసేపు చల్లారనిచ్చి నిమ్మకాయంత సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు గులాబ్‌జామ్ పౌడరులో నీళ్లు పోసుకుని పిండిలా కలుపుకోవాలి.
- Step 6
కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా చేసుకుని క్యారెట్ హల్వా ఉండను మధ్యలో ఉంచి చుట్టూ మూసేయాలి. ఇది పగుళ్లు లేకుండా చూసుకోవాలి.
- Step 7
ఇలా చేసుకున్న గులాబ్ జామూన్లను వేడి నెయ్యిలో వేయించుకుని ముందుగా సిద్ధంగా ఉంచుకొన్న పంచదార పాకంలో వేసేయాలి.
- Step 8
అవి పదిహేను నిమిషాలయ్యాక తింటే బాగుంటాయి. కావాలనుకుంటే.. జీడిపప్పును సన్నటి పలుకుల్లా చేసుకుని క్యారెట్ హల్వాలో వేసుకోవచ్చు.