- Step 1
అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పును తీసుకుని మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి.
- Step 2
ఓ గిన్నెలో మైదా, బొంబాయిరవ్వా, కరిగించిన డాల్డా, అల్లం, పచ్చిమిర్చి పేస్టూ, తెల్ల నువ్వులూ, మరికొంచెం ఉప్పూ వేసుకుని బాగా కలపాలి.
- Step 3
తరవాత సరిపడా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని అరగంట సేపు నాననివ్వాలి.
- Step 4
గవ్వల చెక్కను శుభ్రంగా కడిగి నూనె రాసి ఈ పిండిని కొద్దిగా తీసుకుని దానిపై గవ్వల్లా చేసుకుంటే సరిపోతుంది.
- Step 5
ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేయించుకుని తీసుకోవాలి.