- Step 1
మైదాలో నెయ్యి వేసి కలపాలి. తరవాత అవసరమైతే మరికాస్త నెయ్యి లేదా నూనె వేసి కలపాలి.
- Step 2
తరవాత కొంచెంకొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా కలిపి తడిబట్ట వేసి కప్పి ఉంచాలి.
- Step 3
గిన్నెలో కోవా వేసి మెత్తగా చిదమాలి. చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కోవా వేసి అది గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి.
- Step 4
పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. బాదం, జీడిపప్పు ముక్కలు, కొబ్బరితురుము, ఎండుద్రాక్ష వేసి రెండు నిమిషాలు వేయించి దించి చల్లారనివ్వాలి.
- Step 5
పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న పూరీల్లా వత్తాలి.
- Step 6
ఒక్కోదాంట్లో కాస్త కోవా మిశ్రమాన్నివేసి కజ్జికాయల మాదిరిగానే వేళ్లతో కాస్త మెలిపెట్టినట్లుగా అంచుల్ని నొక్కాలి.
- Step 7
ఇలాగే అన్నీ చేసుకుని నెయ్యి లేదా నూనెలో వేయించి తీసి బ్లాటింగ్ పేపర్‌తో అద్దేస్తే నోరూరించే గుజియా(కోవా కజ్జికాయ)లు రెడీ.