- Step 1
ముందుగా చికెన్ శుబ్రంగా కడిగి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పక్కన ఉంచాలి.
- Step 2
మిక్లీలో ఒక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీన ఆకులు, వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
- Step 3
పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 4
ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ వేసి 10 నిమిషాలు ప్రై చేసుకోవాలి.
- Step 5
ఇందులో ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, గరం మసాల, కర్రీ మసాల వేసి తగినన్ని నీళ్ళు పోసి చికెన్ ఉడికించాలి.
- Step 5
చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.