- Step 1
ఓ గిన్నెలో పాలు తీసుకుని వేడిచేయాలి. అవి మరిగాక మంట తగ్గించి గోధుమ పిండి కలిపి పొయ్యి కట్టేయాలి.
- Step 2
ఇందులో అర చెంచా చొప్పున యాలకుల పొడి, సోంపు పొడి కలపాలి.
- Step 3
మరో పాత్రలో నెయ్యి కరిగించి కొబ్బరి తురుమును ఓ నిమిషం పాటు వేయించి ఆ తరవాత బెల్లం తురుము, మిగిలిన యాలకుల పొడి, సోంపుపొడి చేర్చాలి.
- Step 4
మిశ్రమం గట్టిపడి.. గిన్నె నుంచి వేరయ్యేంత వరకు కలుపుతూ ఉండి.. ఆ తరవాత పొయ్యి కట్టేయాలి.
- Step 5
ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నిమ్మకాయంత ఉండల్లా చేసి.. ఆ తరవాత వెడల్పుగా వచ్చేలా అద్దుకుని అందులో చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి.. చుట్టూ మూసేయాలి.
- Step 6
కొబ్బరి మిశ్రమం ఇవతలకు రాకుండా మరోసారి అద్ది.. కాగుతున్న నూనెలో వేయించాలి.
- Step 7
కమ్మని కొబ్బరి కాక్రా సిద్ధమైనట్లే. పిల్లలు ఇష్టంగా తింటారు.