- Step 1
సెనగల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ మెత్తగా కాకుండా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
- Step 2
బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కొబ్బరిముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి.
- Step 3
అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి సెనగల ముద్ద వేసుకుని వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత పాలు పోసి మంట తగ్గించాలి.
- Step 4
అది ఉడికిందనుకున్నాక బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం కరిగేలోగా.. విడిగా తీసిపెట్టుకున్న టేబుల్‌స్పూను పాలల్లో బియ్యప్పిండి వేసి కలపాలి.
- Step 5
బెల్లం కరిగాక పాలు కలిపిన బియ్యప్పిండిని వేసేయాలి. కాసేపటికి పాయసం చిక్కగా అవుతుంది.
- Step 6
అప్పుడు కొబ్బరి తురుము, కొబ్బరిపాలూ, యాలకులపొడీ, వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలూ, జీడిపప్పు పలుకులూ పాయసంలో వేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి.