- Step 1
బొంబాయిరవ్వా, చక్కెర కలిపి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.
- Step 2
అవి మరుగుతున్నప్పుడు అందులో ఉప్పూ, చెంచా యాలకులపొడీ, మిరియాలపొడీ, చెంచా నెయ్యి వేయాలి.
- Step 3
రెండు నిమిషాలయ్యాక చక్కెర కలిపిన బొంబాయిరవ్వను కొద్దికొద్దిగా వేస్తూ, ఉండలు కట్టకుండా
- Step 4
తరవాత మంట తగ్గిస్తే కాసేపటికి రవ్వ ఉడికి హల్వాలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి.
- Step 5
ఇప్పుడు మరో గిన్నెలో కొబ్బరి తురుమూ, చక్కెరపొడీ, మిగిలిన యాలకులపొడి తీసుకుని అన్నింటినీ కలపాలి.
- Step 6
చేతికి కాస్త నెయ్యి రాసుకుని బొంబాయిరవ్వ హల్వాను కొద్దిగా తీసుకుని చిన్న పూరీలా వత్తుకోవాలి. అందులో కొబ్బరి మిశ్రమాన్ని ఒక చెంచా ఉంచి అంచుల్ని మూసేయాలి.
- Step 7
ఇలా మిగిలిన మిశ్రమాన్ని చేసుకోవాలి. ఇప్పుడు వాటిని రెండు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.