- Step 1
బియ్యాన్ని కడిగి రెండు రోజులు నానబెట్టాలి. దుర్వాసన రాకుండా రోజుకు రెండు సార్లు కడిగి నీళ్ళు మార్చాలి. తరువాత నీళ్ళను వంపి, శుభ్రమైన వస్త్రంపై బియ్యాన్ని ఇంటిలోనే 5 – 10 నిమిషాలపాటు ఆరబెట్టి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
బెల్లాన్ని మెత్తగా తరిగి దానిలో పావు లీటరు నీళ్ళు పోసి పెద్ద మంటమీద ఆగకుండా కలుపుతూ పాకాన్ని తయారుచేసుకోవాలి. పాకం ఉండలాగా రావాలి. సాగకూడదు. స్టౌ ఆపేసి, 2 టీ స్పూన్ల నెయ్యి, 100 గ్రాముల నువ్వులు ఆ పాకంలో కలపాలి.
- Step 3
ఆ పాకంలో మెల్లగా బియ్యం పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా అరిసెలు ఒత్తుకోవడానికి సరిపడా అయ్యేట్టుగా చేసుకోవాలి.
- Step 4
ఈలోగా ఒక కిలో నెయ్యి లేదా నూనెను ఒక చిన్న మూకుడులో పోసి వేడిచెయ్యండి. మూకుడు పెద్దగా వుండకూడదు. పెద్ద మూకుడు పెడితే నూనెను ఎక్కువగా దానికి తగ్గట్టుగా పోయాల్సి వుంటుంది.
- Step 5
పాకం పట్టిన పిండి మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా లడ్డు చేసుకునేట్టు వుండాలి. అది వేడిగా ఉండగానే కొంత పాకం పట్టిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మందంగా ఉన్న ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనెను రాసి దానిపై కొంచెం పాకం పట్టిన పిండిని పెట్టి గుండ్రంగా అరిసె ఒత్తుకోవాలి.
- Step 6
అట్లా తయారు చేసుకొన్న అరిసెలను మెల్లగా మూకుడులో పోసి వేడిచేసిన నూనెలోకి వదలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించండి. తరువాత దానిని జల్లిగరిటెతో తీసి వెంటనే అరిసెల చెక్కమీద వుంచి గట్టిగా ఒత్తి అదనంగా ఉన్న నూనెను తీసి టిష్యూ పేపర్ మీద వుంచండి. అరిసెలకు ఇంకా ఏమైనా నూనె వుంటే అది పీల్చుకుంటుంది.