- Step 1
బియ్యాన్ని కడిగి నీళ్ళలో 4 – 5 గంటలు నానబెట్టాలి.
- Step 2
తరువాత నీటిని వంపేసి పలుచని వస్త్రంపై 25 నిమిషాలపాటు ఆరనివ్వాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 3
ఒక పెద్ద బేసిన్ లో పిండిని, ఓమను, నువ్వులను, ఉప్పును వేసి బాగా కలపాలి.
- Step 4
తరువాత మెల్లగా నీళ్ళను పోస్తూ మరీ పలుచగా లేదా గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
- Step 5
ఒక గిన్నెలో నీటిని తీసుకొని చేతులను తడిచేసుకోవాలి.
- Step 6
కొంచెం కొంచెం పిండిని తీసుకొని గుండ్రగా సన్నగా గుడ్డమీద చుట్టుకోవాలి.
- Step 7
ఆ గుడ్డ పిండిలోని నీటిని పీల్చుకొంటుంది.
- Step 8
అలాగే కాసేపు ఆరనివ్వాలి. లోతుగా ఉన్న మూకుడులో నూనె పోసి, వేడయ్యాక నూనెలో వేయించుకోవాలి. సూచన: సకినాలు స్పైసీగా కావాలంటే, ఎండు మిరపకాయలను గ్రైండ్ చేసి పిండిలో కలపాలి.