- Step 1
బాస్మతి బియ్యం అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఈలోపు స్టవ్ మీద పాత్ర పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- Step 2
నూనె వేడెక్కాక మసాలా దినుసులు, మిరియాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, తరగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు కీమా వేసి వేయించాలి.
- Step 3
అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు, కారం, పుదీనా ఆకులు వేసి వేయించాలి. అవి బాగా వేగాక మూడున్నర కప్పులు వేడి నీళ్లు పోయాలి.
- Step 4
ఆ నీళ్లలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి పాత్రలో బియ్యం వేయాలి. గరం మసాలా బియ్యంలో కలపాలి.
- Step 5
బియ్యం సగం ఉడికాక స్టవ్ ని సిమ్లో పెట్టి ఉడికించాలి. పావుగంటలో బిర్యానీ ఉడికిపోతుంది. దానిపై కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే ఖీమా పలావ్ రెడీ.