- Step 1
రొయ్యల్ని బాగా కడిగి గిన్నెలో వేసుకోవాలి. అందులో కాస్త పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి, కారం వేసి, బాగా కలిపి ఒక గంట పాటూ పక్కన పెట్టేయాలి.
- Step 2
బాస్మతి బియ్యం కడిగి ఇరవై నిమిషాల పాటూ నానబెట్టాలి. స్టౌ మీద పెద్ద గిన్నె పెట్టి (బిర్యానీ పాత్ర) ముప్పావు కిలో బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.
- Step 3
అందులో మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, సరిపడినంత ఉప్పు వేసి కలపాలి.
- Step 4
ఇప్పుడు పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడకడానికి పదినిమిషాల ముందు స్టవ్ ఆపేయాలి. బియ్యంలోని నీటిని వంపేయాలి.
- Step 5
పాన్‌ను స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడెక్కాక తరిగిన ఉల్లి, పచ్చిమర్చి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. మారినేషన్ చేసిన రొయ్యల్ని కూడా అందులో వేసి వేపాలి. తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. గ్రేవీలా వచ్చాక ఆపేయాలి.
- Step 6
ఇప్పడు ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి అడుగున కొంచెం నూనె వేసి, సగం ఉడికిన రైస్ కొంత పరవాలి. దానిపై రొయ్యల గ్రేవీ వేయాలి.
- Step 7
మళ్లీ దానిపై మిగిలిన రైస్ వేసేయాలి. రైస్ పై కాస్త నెయ్యి చల్లి, తరిగిన పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇప్పడు కుక్కర్ మూతపెట్టి, విజిల్ కూడా పెట్టేయాలి. ఒక అయిదు నిమిషాల పాటూ స్టవ్ సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి.
- Step 8
విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. పావు గంట తరువాత మూత తీస్తే బిర్యానీ వాసన ఘుమఘుమలాడి పోతూ వస్తుంది.