- Step 1
గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించాలి. రొయ్యల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నేతిలో రొయ్యల్ని ఓ నిముషం పాటూ వేయించాలి. వాటిని ఓ బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఆ కళాయిలోనే ధనియాల పొడి, ఎండుమిర్చి, ఉల్లిపాయముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 4
అవి వేగాక ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూర వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
- Step 5
కాసేపయ్యాక వేయించిన రొయ్యల్ని వేసి కలపాలి. బాగా ఉడికేవరకు కళాయిని స్టవ్ మీదే ఉంచాలి.
- Step 6
చివరలో కొత్తి మీర తరుగు చల్లి స్టవ్ కట్టేయాలి. యమ్మీ యమ్మీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ.