- Step 1
మటన్‌ను బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మూడు కప్పుల నీళ్లు, కాస్త పసుపు వేసి పావుగంట సేపు ఉడికించుకోవాలి.
- Step 2
ఉడికిన మటన్ తీసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో సోంపు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు వేయించాలి.
- Step 3
వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- Step 4
అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి మూడు నిమిషాల పాటూ వేయించాలి.
- Step 5
అనంతరం పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి.
- Step 6
బాగా వేయిస్తే నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు టమోటో ముక్కలు, కారం, ముందుగా పొడి చేసిన మసాలా, ఉప్పు వేసి కలపాలి. పది నిమిషాలు మీడియం మంట మీద వేగనివ్వాలి.
- Step 7
అనంతరం పెప్పర్ పౌడర్ మటన్న ముక్కలపై చల్లి బాగా కలిపి... మూడు నిమిషాల పాటూ వేగనివ్వాలి. అంతే మటన్ పెప్పర్ ఫ్రై సిద్ధమైనట్టే. దీనిపై కొత్తిమీర గార్నిష్ చేస్తే బాగుంటుంది.