- Step 1
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి.
- Step 2
బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి.
- Step 3
స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- Step 4
ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి. మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి.
- Step 5
దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి.
- Step 6
పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.