- Step 1
ముందుగా చపాతీలు తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ రెడీ చేయాలి.
- Step 2
ముందుగా చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మారినేట్ చేయాలి.
- Step 3
ఒక 20 నిముషాల పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కళాయిలో నూనెవేసి స్టవ్ మీద పెట్టాలి. నూనె వేడెక్కాక షాజీరా, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి.
- Step 4
తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేపాలి. అవి వేగాక ముందుగా మారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి మూత పెట్టి పదినిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 5
తరువాత కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కారం వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
- Step 6
ఓ పదినిముషాల తరువాత చూస్తే నీరు బాగా ఇంకి పోతుంది. అప్పుడు ఓ అయిదు నిమిషాల పాటూ కలుపుతూ, బాగా వేయించాలి.
- Step 7
చికెన్ ఫిల్లింగ్ సిద్ధమైనట్టే.ఇప్పుడు చపాతీని తీసుకుని మధ్యలో మయోన్నాస్ పూయాలి. పూసిన ప్రదేశంలోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, కేరట్ ముక్కలు పరిచి వాటిపై రెడీ చేసిన చికెన్ ఫిల్లింగ్ ను వేసి రోల్ లా చుట్టాలి. ఇప్పుడు దానిని తింటే మంచి రుచిగా ఉంటుంది.