- Step 1
బియ్యంను కడిగి నీరు వార్చి, అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకుల్ని సన్నగా తరగాలి. టొమాటోలని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టౌ మీద అన్నం వండే పెద్ద పాత్ర పెట్టుకోవాలి. అందులో సరిపడినంత నూనె వేసి, వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేపాలి.
- Step 3
తరువాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి.
- Step 4
ఇప్పుడు మీరు ఎన్ని కప్పుల బియ్యం తీసుకున్నారో... దానిని బట్టి కప్పు బియ్యానికి, కప్పున్నర నీళ్లు చొప్పున పాత్రలో పోయాలి.
- Step 5
ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టొమాటో పేస్టుని కూడా అందులో వేసి బాగా కలపాలి.
- Step 6
నీళ్ల మిశ్రమం బాగా మరిగాక అందులో బియ్యం, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి.
- Step 7
నీళ్లు ఇంకి అన్నం సిద్ధమవుతుందనగా కాస్త నెయ్యి వేయాలి. రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని దించేసుకోవడమే. పుదీనా పులావ్ సిద్ధమైనట్టే.