- Step 1
రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
వాటిపై నిమ్మరసం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పూ, సగం కారం, జీలకర్రపొడి, పసుపూ వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి.
- Step 3
పదిహేను నిమిషాలయ్యాక బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి రొయ్యల్ని వేయించి తీసుకోవాలి.
- Step 4
అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి తరుగూ, ఉల్లిపాయముక్కలు వేయించాలి.
- Step 5
తరవాత మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దా, కారం, ధనియాలపొడి, టొమాటో ముక్కలు వేయాలి.
- Step 6
టొమాటోలు మెత్తగా అయ్యాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంట తగ్గించాలి.
- Step 7
ఐదు నిమిషాలయ్యాక క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగూ, పుదీనా, మెంతిఆకులు వేయాలి. అన్నీ వేగాక.. దింపేముందు కొద్దిగా ఉప్పు చల్లితే సరిపోతుంది.