- Step 1
పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరగాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి పిండాలి.
- Step 2
మామిడికాయల మీద ఉండే తొక్క తీయకుండా చిన్న ముక్కలు తరగాలి.
- Step 3
కడాయిలో నూనె వేడిచేశాక పల్లీలు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి లేత ఎరుపురంగుకి వచ్చేవరకూ వేగించాలి.
- Step 4
ఈ తాలింపులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి తరుగు వే సి బాగా వేగించాలి.
- Step 5
ఆ తర్వాత చింతపండు రసం పోసి ఇంగువ, ఉప్పు, కరివేపాకులు జోడించాలి.
- Step 6
ఈ మిశ్రమంలో కారం వేసి గరిటెతో బాగా కలిపి అందులోని నూనె మోతాదు తగ్గేవరకు ఉడికించాలి.
- Step 7
ఆ తర్వాత మామిడికాయ ముక్కలను తాలింపులో వేసి స్టవ్ మీద నుంచి దించి గరిటెతో బాగా కలపాలి.
- Step 8
ఇలా కలపడం వల్ల మామిడికాయ ముక్కలకు ఉప్పు, కారాలు బాగా పడతాయి.
- Step 9
వేడిగా ఉన్న పులిహోర ఆవకాయను పెద్దపళ్లెంలో పోసి ఆరబెట్టాలి. అది చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో పెట్టాలి. ఈ పులిహోర ఆవకాయ నెలరోజులు నిల్వ ఉంటుంది.