- Step 1
ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండి మిర్చి విడివిడిగా వేపి ఉంచాలి.
- Step 2
ఇప్పుడు బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసిన ముక్కలు నీళ్ళలో వేసి పక్కనవుంచాలి.
- Step 3
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి.
- Step 4
నూనె కాగిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి.
- Step 5
ఇప్పుడు పొడిగా వేపి ఉంచిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండిమిర్చి, వెల్లుల్లి అన్నికలిపి వీటికి చింతపండు చేర్చి మెత్తగా నూరాలి.
- Step 6
ఇప్పుడు ముక్కలు వేయించిన పాన్ లో రెండు టీ స్పూన్లు నూనె వేడి చెయ్యాలి.
- Step 7
కాగాక కరివేపాకు, పచ్చిమిర్చిముక్కలు, ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు వేసి నూరిన మసాల వేసి వేయించాలి.
- Step 8
ఒకసారి కలిపి, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి.