- Step 1
సెనగపప్పు కడిగి పావుగంట నానబెట్టాలి.
- Step 2
ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, ఉల్లిముక్కలు, మిర్చి ముక్కలువేసి వేపాలి.
- Step 4
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, పసుపు, కారం వేసి కలిపి సెనగపప్పు వేసి బాగా కలిపి, సరిపడానీళ్ళుపోసి మూతపెట్టి ఉడకనివ్వాలి.
- Step 5
పది నిముషాలు ఉడికిన తరువాత ఉప్పు, రాళ్ళు లేకుండా శుబ్రం చేసిన తెలగపిండి వేసి సింలో అయిదు నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 6
ఇప్పుడు కూర పొడిపొడిగా అయ్యి తినటానికి రెడీగా వుంటుంది. (కావాలంటే నిమ్మకాయ పిండు కోవచ్చు)