- Step 1
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాననివ్వాలి ,కురాలన్నీ తరిగి పెట్టుకోవాలి
- Step 2
ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి ,అందులో 2,3 టేబుల్ స్పూన్ల నునె వేసుకోవాలి.
- Step 3
నునె కాగాక అందులో లవంగాలు,యాలకులు ,జీడి పప్పు,బిర్యానీ ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
- Step 4
ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి ,ఉల్లిపాయలు వేగాక అల్లం వేల్లిల్లి ముద్ద వెయ్యాలి, అది పచ్చి వాసనా పోయే ఢాకా వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.
- Step 5
వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి,అవి కొంచెం వేగనివ్వాలి.
- Step 6
ఇప్పుడు ననబెట్టుకున్న బియ్యం వెయ్యాలి ,అన్ని బాగా కలిపి కోతి మీరా ,పుదిన ,ఉప్పు ,పసుపు కారం,మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
- Step 7
ఇప్పుడు ఒక లీటర్ నీరు పోసి అన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ,కుక్కర్ రెండు వెసిల్స్ రాగానే కట్టేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ.