- Step 1
మందుగా బెండకాయలను కడిగి తడి లేకుండా తుడిచి ఒక వైపు పొడువుగా కట్ చేయాలి. మటన్ శుబ్రంగా కడిగి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బెండకాయలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
కుక్కర్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు ఉల్లిముక్కలు, వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 4
తరువాత పచ్చిమిర్చి, మటన్ వేసి 5 నిమిషాలు ఫ్రై చేయాలి.
- Step 5
తరువాత అల్లంవెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి 10 నిమిషాలు మగ్గించాలి.
- Step 6
ఇందులో టమాటాలు, గరంమసాల బెండకాయలు, కొత్తిమీర తరుగు తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి దించాలి. అంతే రుచికరమైన బెండి మటన్ రెడీ.