- Step 1
సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 6 గంటలు నానబెట్టాలి.
- Step 2
తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి (అవసరమైతే కొద్ది నీరు వాడొచ్చు) 8 గంటల సేపు పక్కనుంచాలి.
- Step 3
తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, (5 గంటలపాటు నానబెట్టిన) శనగపప్పుని కలపాలి.
- Step 4
చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి.
- Step 6
ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయి.