- Step 1
పాన్ లో నూనె వేయకుండ నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, గసగసాలు, దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి.
- Step 2
మిక్సీలో ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి తురుము మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగినతరువాత ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లిపాయపేస్ట్, కొబ్బరి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఇందులో మటన్ ముక్కలు ఉప్పు వేసి, కారం, తగినన్ని నీళ్ళు పోసి నిమిషాలు ఉడికించాలి.
- Step 5
మటన్ పూర్తిగా ఉడికిన తరువాత ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి దించాలి. అంతే రుచికరమైన మటన్ తంబాడ రెడీ