- Step 1
అడుగు మందంగా ఉన్న బాణలిని ఒకమాదిరి మంటపై పెట్టి నెయ్యి కరిగించాలి.
- Step 2
అందులో జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బంగా రు రంగు వచ్చేవరకు సుమారు ఐదు నిమిషాల పాటు వేయించా లి.
- Step 3
తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
అనంతరం గోధు మ పిండిని నేతిలో వేసి పది ని మిషాల పాటు బంగారు రంగు లోకి వచ్చే వరకు వేయించాలి.
- Step 5
పక్కనే మరో పొయ్యి మీద మం దపాటి అడుగున్న గిన్నెలో నీళ్ళు పోసి చక్కెర వేసి అది కరిగి పాకమయ్యేలా తిప్పాలి.
- Step 6
ఇలాచీ పొడిని పాకం లో వేసి నెమ్మదిగా దా నిని వేగిన పిండి మీద పోయాలి. పాకం వేసేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
- Step 7
బాణలి పక్కల నుంచి హల్వా ఊడి వచ్చే వరకూ ఉ డికించాలి.
- Step 8
తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ హల్వాను పరచాలి.
- Step 9
దానిపై వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు జల్లాలి.
- Step 10
ముక్కలుగా కట్ చేసి సర్వ్ వేడిగా అయినా సర్వ్ చేయవచ్చు లేదా చల్లబడే దాకా ఉంచి తినవచ్చు. ఎలా తిన్నా రుచి మాత్రం మధురం.