- Step 1
ముందుగా అంజీరాలను రెండు కప్పుల నీళ్ళలో మూడు నుంచి నాలుగు గంటలపాటు నానపెట్టాలి.
- Step 2
తరువాత వాటిని వడకట్టి అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జులా తయారు చేయాలి.
- Step 3
మరికొన్ని అంజీరాలను ఒక కప్పు వేడినీటిలో రెండు మూడు నిమిషాలు ఉండనిచ్చి బయటకి తీసి చల్లబడనివ్వాలి.
- Step 4
అవసరమైతే కాసిన నీళ్ళు పోసి దాన్ని కూడా గుజ్జులా తయారు చేసుకోవాలి.
- Step 5
సీడ్‌లెస్ ఖర్జూరాలను తీసుకుని సన్నని ముక్కలుగా తరుక్కుని అరకప్పు వేడి నీటిలో పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి.
- Step 6
తర్వాత వాటిని కూడా బయటకు తీసుకుని గుజ్జులా తయారు చేసుకోవాలి.
- Step 7
దీనితో పాటు కొన్ని ఖర్జూరాలు తీసుకొని ముపె్పై సెకెన్ల పాటు ఒవెన్‌లో ఉడికించి దానిని కూడా అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.
- Step 8
బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
- Step 9
తర్వాత నేతిని మందబాపాటి గిన్నె లేదా బాణలిలో వేడి చేసి దానిలో ఈ అంజీర, ఖర్జూరాల గుజ్జును పోయాలి.
- Step 10
మీడియం మంట మీద పది నుంచి పావు గంటసేపు అందులోని నీరంతా ఇంకిపోయే దాకా ఉడికించాలి.
- Step 11
ఈ మిశ్రమం ఉండలు చుట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి.
- Step 12
తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలను వేసి కలిసేలా తిప్పాలి.
- Step 13
ఉండకట్టకుండా తిప్పుతూ మరో పావుగంట సేపు ఉడికించి అది పక్కలకు అంటుకోవడం మానేసినప్పుడు దించి ఒక ట్రేకి నెయ్యి రాసి అందులో పోయాలి.
- Step 14
దానిపై సిల్వర్ ఫాయిల్ కప్పాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా చేసి తినడమే.