- Step 1
క్యాప్సికమ్‌లను కొద్దిగా నీరుపోసి ఉప్పు, పంచదారతో కలిపి ఉడికించి ఉంచాలి.
- Step 2
పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి.
- Step 3
ఆపై అందులోనే కడిగి ఉంచుకున్న బియ్యం వేసి తగినన్ని నీళ్లుపోసి కలియబెట్టి ఉడికించాలి
- Step 4
అన్నం ఉడుకుతుండగా మధ్యలో ఉడికించిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి, పైన మళ్లీ ఉడుకుతున్న అన్నంతోనే కవర్ చేసి.. సన్నటి సెగమీద ఉడికించాలి.
- Step 5
అన్నం బాగా ఉడికిన తరువాత దించేసి.. పైన సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించిన జీడిపప్పులతో అలంకరిస్తే.. నోరూరిస్తూ, మంచి రుచిగా ఉండే క్యాప్సికమ్ పలావ్ తయారైనట్లే..!