- Step 1
గోధుమ పిండిని కొద్దిగా నీళ్ళుపోసి ముద్దలా కలిపి, అర గంట పక్కనపెట్టాలి.
- Step 2
బంగాళాదుంపలు వుడకపెట్టి, తొక్కతీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.ఉల్లి, మిర్చి ముక్కలుగా చేసి ఉంచాలి.
- Step 3
స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక ఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.
- Step 4
తరువాత ఉడకబెట్టిన బంగాలదుంపల ముక్కలు వేసి కలిపి, ఉప్పు,కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
- Step 5
ఇప్పుడు కొచెం నీళ్ళల్లో సెనగపిండి వేసి, ఉండలులేకుండా కలిపి,ఉడుకుతున్న కూరలో వేసి కలపాలి.
- Step 6
కూర చిక్కగా (నీరు తగ్గిన) అయ్యాక స్టవ్ మీదనుండి దించాలి. అంటేచపాతి లోకి కూరరెడి .
- Step 7
ఇప్పుడు కలిపిన గోధుమ పిండి ముద్దను తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతిలా చెయ్యాలి.
- Step 8
స్టవ్ మీద అట్లరేకు పెట్టి (నాన్-స్టికు పాన్) గొద్దిగా నూనె వేసి, వేడయ్యాక చపాతి వేసి రెండు ప్రక్కలా కాల్చాలి.