- Step 1
ముందుగా ప్రైయింగ్ పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 2
అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి.
- Step 3
ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- Step 4
అందు లోనే సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్ది సేపు ఉడికించుకోవాలి. ఈ ఖీమా మిశ్రమానికి బటర్ జోడించి మిక్స్ చేయాలి.
- Step 5
ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న మసాలాతో కలపాలి.
- Step 6
తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ప్రై చేసుకోవాలి. అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.
- Step 7
మంట తగ్గించి ఖీమా మొత్తం ముక్కకు పట్టే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.