- Step 1
బియ్యం కడిగి నానపెట్టాలి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకోవాలి,
- Step 2
గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు, దోరగా వేయించాలి.
- Step 3
అందులో 6 కప్పుల నీళ్ళుపోయాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 4
అన్నం ఉడికిన తరువాత దించి దానిని 3 భాగాలుగా చేయాలి.
- Step 5
పాన్ లో నెయ్యివేసి అందులో గ్రైండ్ చేసుకున్న పుదినా, కొత్తిమీర మిశ్రం వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1 భాగం అన్నంలో కలపాలి.
- Step 6
పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో క్యారెట్ తురుము వేసి వేయించి 2 వ భాగం అన్నం లో కలపాలి
- Step 7
వెడల్పాటి సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో క్యారెట్ రైస్ తరువాత తెల్ల అన్నం, తరువాత ఆకుపచ్చ అన్నం వేసి సమానంగా సర్ది సర్వ్ చేయాలి. జెండా రంగులో రైస్ కనువిందు చేస్తుంది.