- Step 1
పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి.
- Step 2
మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి.
- Step 3
తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
- Step 4
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.
- Step 5
ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.
- Step 6
అంతే మసాలా పీతల వేపుడు రెడీ.