- Step 1
గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
- Step 2
స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
- Step 3
అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం-వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి మగ్గిన తరువాత ములక్కాడముక్కలు వేసి కలిపి, ఒక నిముషం మూతపెట్టాలి.
- Step 4
ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గుడ్లు వేసి మరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.