- Step 1
ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం,వెల్లుల్లి , మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి.
- Step 2
బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి.
- Step 3
మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి.
- Step 4
ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు తెల్లనివ్వాలి.
- Step 5
తెల్లాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగ నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయాలి.