- Step 1
వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి అడుగు మందం ఉన్నగిన్నె లో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి.
- Step 2
అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
- Step 3
వేయించి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి.
- Step 4
తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌లో ఉంచాలి .
- Step 5
ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా బాగుంటుంది.