- Step 1
ముందుగా మినపగుండ్లను కానీ, లేక పప్పును గానీ ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి (సుమారు 8 గంటలు).
- Step 2
అదే సమయంలో బూడిద గుమ్మడి కాయను పైన చెక్కుతీసి ముక్కలుగా కోసుకొని సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును ఒక పలచటి బట్టలో మూటకట్టి వెడల్పాటి పళ్లెంలో ఉంచి దానిమీద ఏదైనా బరువును పెట్టాలి. దీని వల్ల గుమ్మడి తురుములో ఉన్న నీరుఅంతా కిందకు దిగిపోతుంది.
- Step 3
ఉదయాన్నే నానిన మినపగుండ్లను వడకట్టి అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయించుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. జావగా ఉండకూడదు.
- Step 4
తరువాత ఈ పిండిలో వడకట్టిన గుమ్మడి తురుమును వేసి బాగా కలిసేటట్లు తిప్పుకోవాలి. అవసరమైతే గుమ్మడి తురుము నుంచి వడకట్టిన నీరు కొద్దిగా కలుపుకోవచ్చు.
- Step 5
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తడిపిన నూలు బట్టమీద చిన్న చిన్న చిన్న వడియాలు లాగా పెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండిన తరువాత వీటిని బట్టనుండి వేరుచేసి గాలిచోరని డబ్బాలో నిలవ ఉంచుకోవాలి.
- Step 6
ఇవి మరీ ఎక్కువ కాలం నిలవ ఉంచితే పురుగు పట్టే అవకాశం ఉంది కనుక రెండు లేక మూడు నెలలో వాడివేయటం మంచిది. . ఈ వడియాలను కాగిన నూనెలో సిమ్ లో వేయించుకోవాలి.